Header Banner

కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునే వారికి శుభవార్త..! ప్రభుత్వం కీలక ప్రకటన!

  Mon May 19, 2025 14:42        Politics

రేషన్ కార్డు అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో.. రేషన్ కార్డు కూడా చాలా అవసరమే. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే పలు రకాల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందగలం. లేదంటే లేదు. రాస్ట్ర ప్రభుత్వాలు చాలా స్కీమ్స్‌కు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటాయి.

అందుకే రేషన్ కార్డు పొందాలని ప్రతి ఒక్క కుటుంబం భావిస్తుంది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు మాత్రమే కాకుండా రేషన్ కార్డు ఉంటే.. చౌక ధరలకే రేషన్ సరుకులు కూడా పొందొచ్చు. బియ్యం ఉచితంగానే లభిస్తాయి. చక్కెర, కంది పప్పు వంటి వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. అందుకే రేషన్ కార్డు కచ్చితంగా కలిగి ఉండాలి.
ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి రెడీ అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికి సిద్ధమైంది. అర్హుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందువల్ల కొత్త రేషన్ కార్డు పొందాలని భావించే వారు అప్లై చేసుకోవచ్చు.

అయితే తాజాగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కీలక అప్‌డేట్ ఒకటి వచ్చింది. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరన్ కీలక అంశాన్ని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ (వివాహ ధ్రువపత్రం) అవసరం లేదని ప్రకటించారు.

కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ఈ అప్లికేషన్స్‌ను అన్నింటినీ పరిశీలించి కార్డుల జారీ చేపడతామని పేర్కొన్నారు. కొత్తగా పెళ్లైన వారు కొత్త రేషన్ కార్డు పొందాలంటే కచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికెట్ కావాల్సిందే అనే రూల్ అమలులో ఉండేదని, దీని వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారనే సమాచారం తమ వద్దకు వచ్చిందని వివరించారు.

అలాగే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి వినతులు కూడా అందాయని తెలిపారు. అందుకే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదనే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అందువల్ల వివాహం జరిగినట్లు ఏదైనా ఆధారంతో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వెసులుబాటు తెచ్చినట్లు పేర్కొన్నారు.

కాగా కొత్త రేషన్ కార్డులు, ఇంకా ఇతర రేషన్ కార్డు సర్వీసుల కోసం భారీ దరఖాస్తులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత 10 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 13,550 మేర దరఖాస్తులు అందాయి. కొత్త కార్డులకు, బియ్యం కార్డులో కొత్త సభ్యుల పేర్లను చేర్చడం, కార్డుల విభజన వంటి వాటికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RationCardUpdate #GoodNews #GovernmentAnnouncement #PublicWelfare #NewRationCard #RationCardApplicants